: 'రెబ్ టెల్' కొత్తరకం ప్రచారం...మహిళలతో అసభ్య ప్రదర్శన!
స్వీడిష్ కంపెనీ రెబ్ టెల్ ప్రచారం కోసం మహిళలతో ఎంత పని చేయించిందో తెలిస్తే ఎవ్వరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. ఆ కథా కమామీషు ఏమిటంటే...ఈ కంపెనీ కొత్త ఆఫర్ ఒకటి ప్రవేశపెట్టింది. దాంట్లో భాగంగా భారత్ కు అన్ లిమిటెడ్ కాల్స్ ను ఆఫర్ చేసింది. దీన్ని ప్రమోట్ చేయడం కోసం న్యూయార్క్ లోని ప్రసిద్ధ టైమ్స్ స్క్వేర్ లో నలుగురు మహిళలతో అసభ్యకరంగా డ్యాన్స్ చేయించింది. ఒంటిపై నూలుపోగు లేకుండా, ఆ మహిళల ఒంటికి పెయింట్ పూసి చిందులేయించింది. బాలీవుడ్ లో మోతమోగపోయిన 'చమ్మక్ చల్లో' పాటకు వారు చిందులేయడంతో అక్కడ ఉన్నవారు బాగానే ఎంజాయ్ చేశారు. కానీ, విమర్శలు మాత్రం హోరెత్తిపోయాయి. కాగా, తమ సంస్థ చేసిన ప్రమోషన్ తప్పేమీకాదంటూ నిర్వాహకులు సమర్థించుకుంటున్నారు. మహిళలు ఇలా డ్యాన్స్ చేయడం కొత్త పద్ధతేమి కాదని, ఎప్పటినుంచో ఈ పద్ధతి ఉందని ఆర్గనైజింగ్ సెక్రటరీ జొహన్నా డాహ్లిన్ అన్నారు.