: బ్రహ్మదేవాలయంపై దాడి చేసింది నేనే: నిందితుడి ఒప్పుకోలు


బ్యాంకాక్ లోని ఎరవాన్ దేవాలయం దగ్గర గత ఆగస్టు 17న బాంబు దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 20 మంది మృత్యువాతపడగా, పలువురు గాయపడ్డారు. సమీపంలో రికార్డయిన సీసీ పుటేజ్ ఆధారంగా, ఘటన జరిగిన రెండు రోజులకు నిందితుడి ఊహాచిత్రం విడుదల చేసి, ఆగస్టు 29న నాంగ్ చోక ప్రాంతంలోని పూన్ అనంగ్ సమీపంలోని ఓ అపార్ట్ మెంట్ లో నిందితుడిని భద్రతాధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని విచారించగా నేరాన్ని అంగీకరించినట్టు అధికారులు తెలిపారు. దేవాలయంలోని బెంచ్ కింద బాంబుతో కూడిన బ్యాగ్ పెట్టి వెళ్లిపోయినట్టు తెలిపాడని అధికారులు వెల్లడించారు. అయితే ఈ ఘటనకు ఎందుకు పాల్పడ్డాడు? దీని వెనుక ఎవరున్నారు? వంటి వివరాలను అధికారులు వెల్లడించలేదు.

  • Loading...

More Telugu News