: నాగబాబు కుమార్తె నిహారిక టాలెంట్ పై నమ్మకం వ్యక్తం చేసిన కథానాయకుడు నాగశౌర్య!


నాగబాబు కుమార్తె నిహారిక ఇంకా నటనే ప్రారంభించలేదు...కానీ ఆమెపై నమ్మకం వ్యక్తం చేశాడు ఆమె సహనటుడు నాగశౌర్య. టీవీ9, మధుర శ్రీధర్ కలసి సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ద్వారా నిహారిక వెండి తెరకు పరిచయం అవుతోంది. ఈ సందర్భంగా ఆమె ఓ టీవీ ఛానెల్ తో మాట్లాడుతూ, సినిమా కథ నచ్చడం వల్లే నటించాలని నిర్ణయించుకున్నానని తెలిపింది. అయితే ఇప్పటి వరకు సహనటుడిని ప్రత్యక్షంగా చూళ్లేదని, అతనితో మాట్లాడలేదని తెలిపింది. దీంతో సదరు ఛానెల్ అతనితో ఫోన్ లో మాట్లాడించగా, నిహారిక ఇప్పటికే చాలా కథలు విందని, ఈ కథకు ఆమె ఓకే చెప్పడంతో సినిమాపై తనకు మరింత నమ్మకం పెరిగిందని నాగశౌర్య తెలిపాడు. సినిమా కథ బాగున్న విషయం తెలుసని, అయితే ఆ నమ్మకం బలపడడానికి నిహారిక ఒప్పుకోవడం కూడా కలిసి వచ్చిందని చెప్పాడు. 'ఊహలు గుసగులాడే', 'లక్ష్మీ రావే మా ఇంటికి' వంటి సినిమాల ద్వారా నటుడిగా నిరూపించుకున్నాడు.

  • Loading...

More Telugu News