: విశ్వవిద్యాలయాలను పూర్తి స్థాయిలో తీర్చిదిద్దుతాం: కడియం
తెలంగాణలోని విశ్వవిద్యాలయాలను ప్రపంచ స్థాయి విద్యా సంస్థలుగా తీర్చిదిద్దుతామని విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, అధ్యాపకుల కొరత వల్లే యూనివర్సిటీలలో విద్యాప్రమాణాలు పడిపోయాయని అన్నారు. దాని ప్రభావం పరిశోధనలపై పడిందని, యూనివర్సిటీల్లో నాణ్యమైన పరిశోధనలు జరగడం లేదని ఆయన చెప్పారు. గత 20 ఏళ్లుగా యూనివర్సిటీల్లో నియామకాలు జరగలేదని ఆయన తెలిపారు. యూనివర్సిటీల ఆస్తుల డాక్యుమెంటేషన్ కూడా జరగలేదని ఆయన పేర్కొన్నారు. యూనివర్సిటీలు అందించే అన్ని సేవలను ఆన్ లైన్ చేస్తామని ఆయన చెప్పారు. పూర్తి స్థాయి లైబ్రరీలు, విద్యా సౌకర్యాలు కల్పిస్తామని ఆయన తెలిపారు.