: టీడీపీ నేతలు బాబుకు తొత్తులు: తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి


తెలుగుదేశం పార్టీ నేతలు చంద్రబాబుకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి ఆరోపించారు. ప్రజలు బాగుపడటాన్ని, సస్యశ్యామలంగా ఉండటాన్ని టీడీపీ, కాంగ్రెస్ నేతలు భరించలేకపోతున్నారని విమర్శించారు. ప్రాజెక్టుల గురించి సరైన సలహాలు, సూచనలు ఇవ్వలేని నేతలు రాజకీయాలు చేస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. పాలమూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పనులు వేగవంతంగా సాగుతున్నాయని, రైతుల కల త్వరలోనే నెరవేరనుందని ఆయన అన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకం సర్వే పనులు దరిదాపు పూర్తయ్యాని చెప్పారు. సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి కేసీఆర్ కు పూర్తి అవగాహన ఉందన్నారు.

  • Loading...

More Telugu News