: వేసవి రాజధానిని సీమలో... శీతాకాల రాజధానిని ఉత్తరాంధ్రలో పెట్టాలి: టీజీ వెంకటేష్ డిమాండ్
మాజీ మంత్రి, టీడీపీ నేత టీజీ వెంకటేష్ రాయలసీమకు సంబంధించి పలు డిమాండ్లు చేశారు. హంద్రీనీవా సహా సీమ ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేయాలన్నారు. టీటీడీలో స్థానికులకు ఉపాధి కల్పించాలని, గుండ్రేపుల, సద్ధేశ్వరం, వేదవతి ప్రాజెక్టులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. సీమ, ఉత్తరాంధ్రను 14 జిల్లాలుగా విభజించాలని మీడియా సమావేశంలో అన్నారు. రాష్ట్రానికి వేసవి రాజధానిని సీమలో, శీతాకాల రాజధానిని ఉత్తరాంధ్రలో పెట్టాలన్నారు. రెండు రాజధానులు ఏర్పాటు చేయకుంటే మళ్లీ విభజన సెగలు తప్పవని హెచ్చరించారు. సీమ, ఉత్తరాంధ్రల్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని టీజీ కోరారు. కర్నూలులో నిట్, ఐటీ, ట్రిపుల్ ఐటీలను కూడా ఏర్పాటు చేయాలన్నారు. ఏపీకి వెంటనే ప్రత్యేక హోదా ప్రకటించాలని, నవ్యాంధ్ర రాజధాని అమరావతిని ఫ్రీజోన్ గా ప్రకటించాలని తెలిపారు. పట్టిసీమ వల్ల నష్టమేంటో పురందేశ్వరి తెలపాలని ఆయన డిమాండ్ చేశారు.