: రేపటి భద్రత కోసం 25 వేల మందితో భద్రత: సీపీ మహేందర్ రెడ్డి
జంటనగరాల్లో రేపు జరగనున్న గణేష్ నిమజ్జనం సందర్భంగా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు 25 వేల మంది సిబ్బందితో ఏర్పాట్లు చేసినట్టు నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు. దీనికోసం ఏపీ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల నుంచి కూడా బలగాలను రప్పించామని చెప్పారు. 400 సీసీ కెమెరాలతో నిఘాను ఏర్పాటు చేశామని వెల్లడించారు. గణేష్ విగ్రహాలు తరలి వెళ్లే ప్రతిదారిలో కెమెరాలను ఏర్పాటు చేశామని చెప్పారు. ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం తొలి రోజే ముగిసేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. బాలానగర్ గణేషుడి నిమజ్జన యాత్ర వరకు ఆగాల్సిన అవసరం లేదని తెలిపారు. ఏ సమస్య వచ్చినా వెంటనే 100 నంబరుకు కాల్ చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.