: తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ప్రమాదం... 10 మందికి గాయాలు


తిరుమల మొదటి ఘాట్ రోడ్డులోని ఒకటో మలుపు దగ్గర ప్రమాదం జరిగింది. తిరుమల నుంచి తిరుపతికి వస్తున్న ఓ టెంపో అదుపు తప్పి మలుపు దగ్గర పిట్టగోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మంది గాయపడగా, వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. ప్రమాద సమయంలో టెంపోలో మొత్తం 14 మంది భక్తులు ఉన్నారు. వారంతా మహారాష్ట్రకు చెందిన వారుగా గుర్తించారు. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే టీటీడీ విజిలెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకుని వారిని రుయా ఆసుపత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News