: జగన్ దీక్షకు కొత్త స్థలాలను ఎంపిక చేసిన వైసీపీ నేతలు


వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీక్షకు వైసీపీ నేతలు రెండు కొత్త స్థలాలను ఎంపిక చేశారు. గుంటూరులోని నల్లపాడు, అమరావతి రోడ్లు దీక్షకు అనువైన స్థలాలుగా నిర్ణయించారు. గుంటూరు జిల్లా అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని కలసిన వైసీపీ నేతలు దీక్షా స్థలాల పేర్లతో లేఖ అందజేశారు. ఆ రెండు స్థలాలను పరిశీలించి దీక్షకు అనుమతివ్వాలని కోరారు. అక్టోబర్ 7వ తేదీన ప్రత్యేక హోదాపై జగన్ దీక్ష చేయనున్నట్టు ఇవాళ వైసీపీ నేత బొత్స ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు దీక్షకు అనుమతివ్వాలని వైసీపీ రెగ్యులర్ ఫామ్ లో హైకోర్టుకు కూడా వెళ్లనుంది.

  • Loading...

More Telugu News