: హింగిస్-సానియా జోడీ ఖాతాలో మరో టైటిల్
మార్టినా హింగిస్-సానియా మీర్జా మంచి జోరుమీదున్నారు. వీరిద్దరి మధ్య అద్భుతమైన సమన్వయం కుదిరినట్టు కనబడుతోంది. మాజీ వరల్డ్ నెంబర్ వన్ మార్టినా హింగిస్ తో సానియా జోడీ కట్టిన తరువాత టైటిళ్ల వేటలో దూసుకెళ్తున్నారు. యూఏస్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్న అనంతరం వీరిద్దరూ చైనాలోని గాంగ్జూ ఓపెన్ మహిళల డబుల్స్ టైటిల్ లో పాల్గొన్నారు. ఫైనల్ లో చైనాకు చెందిన క్సు-యూ జోడీపై 6-3, 6-1 తేడాతో సానియా-హింగిస్ జోడీ విజయం సాధించింది. దీంతో వీరి ఖాతాలో మరో టైటిల్ వచ్చి చేరింది.