: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఖడ్గమృగం సరస్వతి
హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో ఉన్న ఖడ్గమృగం సరస్వతి నిన్న ఓ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. మూడేళ్ల క్రితం సూరజ్ అనే మరో ఖడ్గమృగంతో కలిపి సరస్వతిని కాన్పూర్ జూ నుంచి తీసుకొచ్చారు. జంతువుల మార్పిడిలో భాగంగా వీటిని హైదరాబాద్ జూకు తీసుకొచ్చారు. చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, తల్లీ బిడ్డ ఆరోగ్యంగా ఉన్నాయని చెప్పారు. బుల్లి ఖడ్గమృగం బరువు 50 కేజీలు ఉందని తెలిపారు. వచ్చే నెల 6వ తేదీన బుల్లి ఖడ్గమృగానికి నామకరణం చేస్తున్నామని చెప్పారు.