: నిజామాబాద్ టీఆర్ఎస్ కార్యాలయంపై గణేశ్ భక్తుల దాడి
నిజామాబాద్ లోని టీఆర్ఎస్ కార్యాలయంపై కొంతమంది దాడి చేశారు. స్థానికంగా ఈసారి నిర్వహించనున్న గణేశ్ నిమజ్జనాలకు డీజే పెట్టుకోవడానికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దాంతో ఆగ్రహం చెందిన కొంతమంది గణేశ్ భక్తులు ఈ దాడి చేసినట్టు సమాచారం. కార్యాలయంలోని ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. అధికారంలో ఉండి కూడా కనీసం అనుమతి కూడా ఇప్పించలేకపోయారని టీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి వారిని చెదరగొట్టారు.