: తమ గగనతలంపై రష్యా విమానాలను నిషేధించిన ఉక్రెయిన్


రష్యన్ ఎయిర్ లైన్స్ విమానాలను నిషేధిస్తున్నట్టు ఉక్రెయిన్ ప్రకటించింది. తమ విమానాశ్రయాల్లో రష్యా విమానాలు ల్యాండ్ కాకూడదని, తమ గగనతలంపై కూడా రష్యా విమానాలు ఎగరకూడదని హెచ్చరించింది. ఈ విషయాన్ని స్వయంగా ఉక్రెయిన్ ప్రధాని ఆర్సెనీ యట్సెనుక్ వెల్లడించారు. తూర్పు ప్రాంతంలోని రెబెల్స్ కు రష్యా మద్దతు ఇస్తుండటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అక్టోబర్ 25వ తేదీ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది. ఈ నిర్ణయంపై స్పందించిన రష్యా... దీన్నొక పిచ్చి చర్యగా అభివర్ణించింది.

  • Loading...

More Telugu News