: పాట్నాలో ఎన్నికల ఏర్పాట్లు పరిశీలించనున్న ప్రధాన ఎన్నికల కమిషనర్
బీహార్ రాష్ట్రంలో వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ నసీం జైదీ పాట్నాలో పర్యటించనున్నారు. రేపు, ఎల్లుండి రెండు రోజులపాటు ఆయన పర్యటన ఉంటుంది. అక్కడ జరుగుతున్న ఎన్నికల ఏర్పాట్లపై ఆ రాష్ట్ర అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. బీహార్ లోని 243 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఐదు విడతల్లో ఈ ఎన్నికలు జరుగుతాయి. తొలి విడత ఎన్నికలు అక్టోబర్ 12న ప్రారంభం కానున్నాయి.