: బాల్య వివాహ నిరోధక చట్టం ముస్లింలకూ వర్తిస్తుంది: గుజరాత్ హైకోర్ట్


బాల్య వివాహ నిరోధక చట్టంపై గుజరాత్ హైకోర్ట్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ చట్టం అన్ని మతాలవారికీ వర్తిస్తుందని పేర్కొంది. బాల్య వివాహ నిరోధక చట్టం ప్రత్యేక చట్టమని, కాబట్టి ఇది ముస్లింలకు కూడా సమానంగా వర్తిస్తుందని తీర్పు వెలువరించింది. ముస్లిం, హిందూ లేదా ఇతర మతాల వ్యక్తిగత చట్టాల్లోని కొన్ని అంశాలను సైతం ఈ చట్టం తిరస్కరిస్తుందని జస్టిస్ జేబి పర్దివాలా స్పష్టం చేశారు. గుజరాత్ కు చెందిన యూనుస్ షేక్ అనే ముస్లిం దాఖలు చేసిన పిటిషన్ ను పరిశీలించిన కోర్టు ఈ విధంగా స్పందించింది. 16 ఏళ్ల బాలికను ఎత్తుకుపోయి అతను పెళ్లి చేసుకున్నాడు. తాను ముస్లింననీ, ముస్లిం పర్సనల్ లా ప్రకారం బాల్య వివాహ నిరోధక చట్టం తనకు వర్తించదని వాదించాడు. ఈ వాదనలను తిరస్కరించిన కోర్టు చట్టప్రకారం అతనిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. పలు మతాల పర్సనల్ లా లోని అంశాలకు అతీతంగా బాల్య వివాహ నిరోధక చట్టం పని చేస్తుందని న్యాయమూర్తి తేల్చి చెప్పారు. అయితే మార్పులు, చేర్పులకు అనుమతించని ముస్లిం పర్సనల్ లా చట్టం వల్ల ముస్లింలకు తీరని నష్టం జరుగుతోందని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News