: వారిద్దరూ పత్రికాధిపతులు... భేటీలో తప్పులేదు: చినరాజప్ప
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రామోజీ గ్రూపుల అధినేత రామోజీరావుల భేటీపై ఏపీ హోం మంత్రి చినరాజప్ప భిన్నంగా స్పందించారు. వారిద్దరూ పత్రికాధిపతులు కాబట్టి వారి భేటీలో తప్పులేదని అభిప్రాయపడ్డారు. విజయవాడలో ఈ మేరకు మంత్రి మాట్లాడుతూ, ఏపీలో మావోయిస్టుల స్థావరాలు లేవన్నారు. మావోలు రాష్ట్రంలో చొరబడకుండా సరిహద్దులో ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. చింతూరు, కొయ్యూరులో పోలీస్ సబ్ డివిజన్లు ఏర్పాటు చేశామని తెలిపారు. తెలంగాణలో రేపు జరిగే వినాయక నిమజ్జనానికి ఏపీ నుంచి 2,300 మంది పోలీస్ సిబ్బందిని తరలించినట్టు చెప్పారు. ఏపీ పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న 4,300 పోస్టులను త్వరలో భర్తీ చేస్తామన్నారు.