: మా వల్ల తెలంగాణ ప్రభుత్వానికి రూ. 40 కోట్ల ఆదాయం: నారా లోకేష్


తెలంగాణ ప్రాంతంలో హెరిటేజ్ సంస్థ వ్యాపారం మొదలై 15 సంవత్సరాలు అయిందని టీడీపీ యువనేత నారా లోకేష్ అన్నారు. పాలు, కాయగూరల వ్యాపారం చేస్తూ ఎంతో మంది రైతులకు తాము అండగా ఉన్నామని చెప్పారు. తమ హెరిటేజ్ సంస్థ వల్ల తెలంగాణ ప్రభుత్వానికి రూ. 40 కోట్ల వరకు ఆదాయం సమకూరుతోందని అన్నారు. డైరెక్ట్ ట్యాక్స్, వ్యాట్ తదితర మార్గాల్లో ఈ ఆదాయం వస్తోందని చెప్పారు. హెరిటేజ్ పాలు నాణ్యతకు మారుపేరు అని... నాణ్యత బాగుండటం వల్లే, తాను కాని, తన తండ్రి చంద్రబాబు కాని, ఇతర కుటుంబ సభ్యులు కాని హెరిటేజ్ పాలనే వాడుతున్నామని తెలిపారు. పాలను కూడా కొంతమంది రాజకీయాలకు వాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News