: విశాఖలో డ్రైనేజీలో పడి చిన్నారి గల్లంతైన ఘటనలో అధికారులపై వేటు


విశాఖ మద్దిలపాలెం ప్రాంతంలోని డ్రైనేజీలో పడి ఆరేళ్ల బాలిక అదితి గల్లంతైన ఘటనలో ముగ్గురు అధికారులపై ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మంత్రి గంటా ఆదేశాల మేరకు... ఘటనకు బాధ్యులైన మున్సిపల్ శానిటరీ ఇన్ స్పెక్టర్, బిల్డింగ్ ఇన్ స్పెక్టర్ ఏఈలను సస్పెండ్ చేస్తూ జీవీఎంసీ కమిషనర్ ప్రవీణ్ కుమార్ నేడు ఉత్తర్వులు జారీ చేశారు. రెండు రోజుల కిందట అంటే గురువారం సాయంత్రం వర్షపు నీటి ఉద్ధృతికి బాలిక అదితి డ్రైనేజీలో పడి కొట్టుకుపోయింది. ఆ వెంటనే ఘటనా స్థలాన్ని సందర్శించిన మంత్రి గంటా బాధ్యులైన వారిపై చర్యలకు నేడు ఆదేశించారు. అయితే బాలిక డ్రైనేజీలో పడిన రోజు వెంటనే అధికారులు స్పందించకపోవడంతో ఇంతవరకు ఆచూకీ తెలియలేదు. ఈ క్రమంలో ఇప్పటికీ బాలిక కోసం సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.

  • Loading...

More Telugu News