: సిరియాలో సూసైడ్ బాంబర్ ఏడుపులు...సోషల్ మీడియాలో ఆసక్తి రేపుతున్న వీడియో
ఇస్లామిక్ రాజ్య స్థాపన కోసమంటూ రంగంలోకి దిగి మారణహోమాన్ని సృష్టిస్తున్న ఐఎస్ కార్యకలాపాలకు అతడు ఆకర్షితుడయ్యాడు. తాను ఆ పవిత్ర యుద్ధంలో పాలుపంచుకోవాలని నిర్ణయించుకున్నాడు. పోలీసుల కళ్లుగప్పి, ఎలాగోలా సిరియా చేరుకున్నాడు. అతడి చొరవకు అచ్చెరువొందిన ఐఎస్ ఉగ్రవాదులు అతడికి ఆత్మాహుతి దాడిని అప్పగించారట. ఇంకేముంది, ఊహించని పరిణామంతో అతడు ఏడుపు లంకించుకున్నాడు. ఆత్మాహుతి దాడిలో తాను చనిపోతానంటూ ఒకటే ఏడుపులు, పెడబొబ్బలు పెట్టాడు. దీంతో చలించిన అతడి స్నేహితులు అతడిని ఓదార్చి పంపారట. అతడి ఏడుపులకు సంబంధించి తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.