: హజ్ యాత్రలో తప్పిపోయిన కరీంనగర్ జిల్లా వాసి


కరీంనగర్ జిల్లా జగిత్యాలకు చెందిన అబ్దుల్ అజీజ్(72) అనే వ్యక్తి హజ్ యాత్రలో తప్పిపోయాడు. ఈ నెల 2వ తేదీన భార్య నఫీస్ ఉన్నీసా బేగంతో కలసి అతను హాజ్ యాత్ర కోసం మక్కా వెళ్లాడు. అక్కడ జుమేరాకు వెళుతుండగా భార్య స్పృహ తప్పి పడిపోయింది. వెంటనే అక్కడున్నవారు ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స చేశారు. ఈలోగా జనంలో చిక్కుకున్న అబ్దుల్ తప్పిపోయాడు. ఈ విషయాన్ని ఆయన భార్య జగిత్యాలలోని తన కుమారుడికి ఫోన్ చేసి చెప్పింది. సౌదీలోని భారత రాయబార కార్యాలయానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, భారత ప్రభుత్వం తన తండ్రి ఆచూకీ కనిపెట్టే ప్రయత్నం చేయాలని కుమారుడు అలీ కోరుతున్నాడు.

  • Loading...

More Telugu News