: కడప అడవుల్లో కాల్పుల కలకలం...రాళ్లేసిన ‘ఎర్ర’ కూలీలపై పోలీసుల కాల్పులు
కడప జిల్లా అడవుల్లో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఎర్రచందనం దుంగల కోసం అడవుల్లోకి వచ్చిన తమిళ కూలీలను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన అటవీ శాఖ సిబ్బందిపైకి రాళ్ల దాడి జరిగింది. లొంగిపోవాలన్న హెచ్చరికలను బేఖాతరు చేసిన తమిళ కూలీలు పోలీసులపైకి రాళ్ల వర్షం కురిపించారు. ఊహించని ఘటనతో షాక్ తిన్న పోలీసులు తమ తుపాకులకు పనిచెప్పక తప్పలేదు. కాల్పులతో తమిళ కూలీలు అక్కడి నుంచి పరారయ్యారు. కడప జిల్లా ఓబులవారిపల్లె మండలం గాదెల సమీపంలోని అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అడవుల్లో కాల్పుల శబ్దాలతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.