: కలెక్టర్లతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని జిల్లాల సమస్యలపై దృష్టి సారించారు. ఈ ఉదయం జిల్లా కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వ్యవసాయ పనుల వివరాలు, వివిధ జిల్లాల్లో నమోదైన వర్షపాత వివరాలను తెలుసున్నారు. రైతుల సమస్యలపై వేగంగా స్పందించాలని, అలసత్వం ప్రదర్శించరాదని సూచించారు. ముద్రాబ్యాంక్, వివిధ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్న తీరుపై వివరాలను అడిగి తెలుసుకున్నారు.