: ఇంత దారుణం ఉమ్మడి రాష్ట్రంలో కూడా జరగలేదు: కేసీఆర్ పై మండిపడ్డ కంచె ఐలయ్య


వరంగల్ జిల్లాలో శృతి, విద్యాసాగర్ రెడ్డిల ఎన్ కౌంటర్ పై విద్యావేత్త ప్రొఫెసర్ కంచె ఐలయ్య మండిపడ్డారు. ఇటువంటి దారుణం ఉమ్మడి రాష్ట్రంలో కూడా జరగలేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రంగు బయటపడిందని ఆయన విమర్శించారు. ఖమ్మంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అత్యాచారం చేసి యాసిడ్ పోసి చంపడం చాలా దారుణమన్నారు. కేజీ టు పీజీ ఉచిత విద్య అందిస్తామంటూ ఎన్నికల ముందు యిచ్చిన హామీని కేసీఆర్ మర్చిపోయారన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలేమో ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియంలో చదువుకోవాలి, వాళ్ల పిల్లలు మాత్రం ఇంగ్లీషు మీడియం విద్య నభ్యసిస్తారా? అంటూ ఆయన ప్రశ్నించారు. క్షేత్ర స్థాయి నుంచే ఉచిత ఇంగ్లీషు విద్యను అందించాలి, అందుకోసం ప్రణాళికలు తయారు చెయ్యాలి, విద్యకు అధిక నిధులు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News