: రేపు తన ఆస్తులను ప్రకటించనున్న నారా లోకేష్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుమారుడు, తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ రేపు తన ఆస్తులను ప్రకటించనున్నారు. ఎన్టీఆర్ భవన్ లో ఈ ప్రకటన చేయనున్నారు. నాలుగేళ్లుగా తన కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను చంద్రబాబు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈసారి స్వయంగా లోకేష్ తన ఆస్తుల వివరాలను ప్రకటించనున్నారు. చంద్రబాబు సహా ఆయన కుటుంబసభ్యులకు సంబంధించి గత ఏడాది ప్రకటించిన ఆస్తులు..చంద్రబాబుకు రూ.71 లక్షలు, భువనేశ్వరికు రూ.31 కోట్లు, లోకేష్ కు రూ.3.57 కోట్లు ఉండగా బ్రాహ్మణి ఆస్తులు రూ.3.96 కోట్లు.