: వేలానికి అరుదైన గులాబీ వజ్రం


అరుదైన గులాబీ వజ్రాన్ని వేలం వేయనున్నట్టు క్రిస్టీస్ సంస్థ ప్రకటించింది. స్విట్జర్లాండ్ లోని జెనీవాలో గల క్రిస్టీస్ ఆక్షన్ హౌస్ లో నవంబర్ 10న 16.08 క్యారెట్ల గులాబీ రంగు వజ్రాన్ని వేలానికి ఉంచినట్టు తెలిపింది. ఈ అరుదైన వజ్రం 23 మిలియన్ డాలర్ల నుంచి 28 మిలియన్ డాలర్లు పలుకుతుందని క్రిస్టీస్ సంస్థ భావిస్తోంది. 250 ఏళ్ల చరిత్ర గలిగిన క్రిస్టీస్ ఆక్షన్ హౌస్ లో ఇప్పటి వరకు 10 కంటే ఎక్కువ క్యారెట్ల ఉంగరాలు మూడింటిని మాత్రమే వేలం వేశామని నిర్వాహకులు తెలిపారు. తాజాగా వేలం వేయనున్న గులాబీ రంగు వజ్రం చుట్టూ రెండు వరుసల్లో తెల్లని వజ్రాలను పొదిగారు. దీంతో ఇది మరింత అద్భుతంగా కనబడుతోంది.

  • Loading...

More Telugu News