: కోల్ కతా జట్టుకు ముఖ్య అతిథిగా సాకర్ దిగ్గజం పీలే
కోల్ కతా జట్టుకు ముఖ్యఅతిథిగా బ్రెజిల్ సాకర్ దిగ్గజం పీలే వ్యవహరించనున్నారు. వచ్చే నెలలో ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) టోర్నీలో భాగంగా డిఫెండింగ్ చాంపియన్ 'అట్లటికో డి కోల్ కతా' (ఏటీకే) జట్టుకు పీలే దిశానిర్దేశం చేస్తారు. అంతేకాకుండా జట్టుతో పాటు ఉంటూ టోర్నీని వీక్షిస్తారు. ఈ విషయాలను కోల్ కతా జట్టు సహ యజమాని సంజీవ్ గోయెంకా మీడియాకు తెలిపారు. వచ్చే నెల 13వ తేదీన కోల్ కతా జట్టు ఆడే తొలి మ్యాచ్ కే పీలే హాజరుకానున్నారని, తమకు పట్టరానంత ఆనందంగా ఉందని ఓ వీడియో ద్వారా ఆయన వెల్లడించారు. పీలే రాక సందర్భంగా సాల్ట్ లేక్ స్టేడియంలో ఘనస్వాగతం పలుకుతామని సంజీవ్ తెలిపారు.