: టెలివిజన్ సీరియల్ ‘బాలికావథు’ రికార్డు


రెండువేల ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న మొట్టమొదటి డ్రామా సిరీస్ గా కలర్స్ టెలివిజన్ సీరియల్ ‘బాలికా వథు’ రికార్డు సృష్టించింది. ఈ సీరియల్ 2008లో ప్రారంభమైంది. బాల్య వివాహాలు, గృహహింస, మహిళా సాధికారత వంటి సామాజిక అంశాల నేపథ్యంలో ఈ సీరియల్ నిర్మాణం జరిగింది. గత 8 ఏళ్లనుంచి ప్రసారం అవుతున్న ఈ సీరియల్ సుమారు 8 లక్షల మంది ప్రేక్షకుల మనసు దోచుకుంది. తెలుగులో 'చిన్నారి పెళ్లికూతురు' పేరుతో వస్తున్న ఈ సీరియల్ కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కలర్స్ సీఈఓ రాజ్ నాయక్ మాట్లాడుతూ తమ సీరియల్ ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ఆయన కృతఙ్ఞతలు తెలిపారు.

  • Loading...

More Telugu News