: శరత్ కుమార్ పై నేను దాడి చేయలేదు: సెన్సార్ బోర్డు సభ్యురాలు మంగారెడ్డి
సినీ నిర్మాత శరత్ కుమార్ పై తాను దాడి చేయలేదని ప్రాంతీయ సెన్సార్ బోర్డు సభ్యురాలు మంగా రెడ్డి అన్నారు. శరత్ కుమార్ పై దాడి చేసినట్లు వచ్చిన వార్తలను ఆమె ఖండించారు. అతనే తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆమె ఆరోపించింది. అభ్యంతర కర మెస్సేజ్ లు పంపండం, ఇష్టమొచ్చినట్లు తిట్టడం వంటివి చేశాడంటూ ఆమె మండిపడింది. ఈ విషయమై అడిగేందుకు శరత్ కుమార్ ఇంటికి వెళ్లిన తనను కొట్టేందుకు యత్నించడంతో, అతన్ని తోసేశానని చెప్పింది. అక్కడే ఉన్న కూలర్ పై శరత్ పడటంతో అతనికి దెబ్బలు తగిలి ఉంటాయని మంగారెడ్డి చెప్పింది. తనపై వేధింపులకు పాల్పడిన శరత్ పై చర్యలు తీసుకోవాలంటూ హైదరాబాదు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఆమె ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.