: రిజర్వేషన్లకు బీజేపీ మద్దతిస్తుంది: కేంద్ర మంత్రి
రాజ్యాంగం ప్రవేశపెట్టిన రిజర్వేషన్ వ్యవస్థకు బీజేపీ మద్దతిస్తుందని కేంద్ర మంత్రి కల్ రాజ్ మిశ్రా తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, వెనుకబడిన వర్గాలు ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగం కల్పించిన ఈ రిజర్వేషన్ల వ్యవస్థ వల్ల వారికి సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన చేయూత లభిస్తుందని అన్నారు. అలాంటి రిజర్వేషన్లకు తామెప్పుడూ మద్దతు పలుకుతామని ఆయన చెప్పారు. కాగా, రిజర్వేషన్లు తమకు కూడా కల్పించాలని కోరుతూ పలు రాష్ట్రాల్లో అగ్రవర్ణాలు ఆందోళనలకు దిగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలుపార్టీల నేతలు రిజర్వేషన్ వ్యవస్థపై ప్రధాని అభిప్రాయం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రి తాజా వ్యాఖ్యలు చేశారు.