: ఆకాశంలో విందు...చైనాలో వినూత్న ఆలోచన


చైనాలోని హెఫై నగరంలో వాండా థీమ్ పార్క్ ప్రారంభించి ఏడాది ముగిసిన సందర్భంగా సందర్శకులకు అద్భుతమైన అనుభూతిని మిగల్చాలని దాని యాజమాన్యం భావించింది. దీంతో సందర్శకుల కోసం వినూత్నంగా ఆకాశంలో విందు ఏర్పాటు చేసింది. ఈ విందు కోసం డిన్నర్ హాల్ లాంటి రూంను ఏర్పాటు చేశారు. అందులో అతిథులను డైనింగ్ టేబుల్ లో కూర్చోబెట్టి, దానిని క్రేన్ తో ఎత్తులోకి తీసుకెళ్తారు. ఇలా విందు చేసేందుకు సందర్శకులు ఉత్సాహం చూపుతున్నారని వాండా థీమ్ పార్క్ నిర్వాహకులు పేర్కొంటున్నారు.

  • Loading...

More Telugu News