: సలహా కోసమే రామోజీరావును జగన్ కలిశారు: పెద్దిరెడ్డి
ఈనాడు గ్రూప్ ఛైర్మన్ రామోజీరావుతో వైకాపా అధినేత జగన్ సమావేశమయ్యారనే వార్త సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కలయిక ఇరు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చనే లేవనెత్తింది. అయితే, రామోజీని జగన్ కలవడంలో తప్పేముందని వైకాపా సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. పెద్దల సలహాలు తీసుకునే క్రమంలోనే రామోజీరావును కలిశారని చెప్పారు. ఈ భేటీని వైకాపా పూర్తిగా సమర్థిస్తోందని అన్నారు. మరో విషయం ఏమిటంటే, ఈ స్టేట్ మెంట్ తో రామోజీ, జగన్ ల భేటీని వైకాపా అధికారికంగా ప్రకటించినట్టయింది.