: నిరాశ్రయుడి కుక్క కోసం 60 వేల పిటిషన్లు... సోషల్ మీడియా ప్రతాపం!


ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో ఓ నిరాశ్రయుడైన వ్యక్తి ఓ కుక్కపిల్లను పెంచుకుంటున్నాడు. తానెక్కడికి వెళితే అక్కడికి దానిని కూడా తీసుకుపోతాడు. ఉన్నట్టుండి, ఓ రోజున 'కాజ్ యానిమల్ నార్డ్' అనే స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు వచ్చి ఆ కుక్క పిల్లను తీసుకుపోతామన్నారు. అయితే, ఆ కుక్కపిల్లను తన నుంచి వేరు చేయవద్దంటూ ఆ వ్యక్తి కాళ్లావేళ్లా పడ్డాడు. అయినా అతని మాట వినని ప్రతినిధులు, దానిని బలవంతంగా లాక్కుపోయారు. ఈ క్రమంలో వారితో ఇంచుమించు ఘర్షణపడ్డాడా వ్యక్తి. ఈ సన్నివేశాన్ని అక్కడే ఉన్న ఓ వ్యక్తి సెల్ ఫోన్ తో షూట్ చేసి, సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. అంతే, ఇది వైరల్ అయ్యింది. దీనిని 10 లక్షల 70 వేల మంది చూస్తే, వారిలో 60 వేల మంది ఆ స్వచ్ఛంద సంస్థపై చర్యలు తీసుకోవాలంటూ స్థానిక కోర్టులో పిటిషన్లు వేశారు. ఈ వీడియో గురించి తెలుసుకున్న స్వచ్ఛంద సంస్థ దీనిపై వివరణ ఇచ్చింది. ఆ వ్యక్తి ఆ కుక్క పిల్లకు వాక్సినేషన్ చేయించలేదని, ఫ్రాన్స్ లో పెంపుడు జంతువులకు వాక్సినేషన్ చేయించకపోవడం నేరమని అన్నారు. అంతే కాదని ఆ కుక్క పిల్లను సదరు వ్యక్తి బిక్షాటన కోసం వినియోగించుకుంటున్నాడని, దానిని అడ్డుకునేందుకే అతని నుంచి దానిని తీసుకెళ్లామని ఆ స్వచ్ఛంద సంస్థ స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News