: జగన్ కుట్ర రాజకీయాలను ప్రజలు నమ్మరు: మంత్రి ప్రత్తిపాటి
పట్టిసీమపై రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేసిన వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కుట్ర రాజకీయాలను ప్రజలు నమ్మలేదని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. పట్టిసీమ ద్వారా రైతులకు ప్రయోజనం చేకూరుతుంటే దానిని అడ్డుకోవడానికి వైఎస్ఆర్సీపీ నేతలు యత్నిస్తుండటం సిగ్గుచేటన్నారు. పట్టిసీమ పూర్తయి రాయలసీమకు నీళ్లొస్తే ఆ ప్రాంతమంతా సస్యశ్యామలమవుతుందని, అప్పుడు వైఎస్ఆర్సీపీ నేతల మాట ఎవ్వరూ వినే పరిస్థితి ఉండదని భావించి ఈ తరహా కుట్రలకు వారు పాల్పడుతున్నారని మంత్రి ఆరోపించారు. అధికారమనేది జగన్ కు ఎండమావిగా కనిపిస్తున్న నేపథ్యంలోనే నిరాహారదీక్షలంటూ డ్రామాలాడుతున్నారన్నారు. కాగా, అనుకున్న సమయానికి పట్టిసీమ పూర్తి చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిదేనని మంత్రి అన్నారు.