: ధోనీ దరిదాపుల్లోకి కూడా ఎవరూ రాలేరు: రవిశాస్త్రి
టీమిండియా వన్డే, టీ20ల కెప్టెన్ ధోనీపై జట్టు డైరెక్టర్ రవిశాస్త్రి ప్రశంసల వర్షం కురిపించాడు. ధోనీ ఓ అద్భుతమైన కెప్టెన్ అని... వేరే కెప్టెన్ ఎవరైనా సరే కనీసం అతని దరిదాపుల్లోకి వస్తాడని కూడా తాను భావించడం లేదని అన్నాడు. ధోనీ సాధించిన విజయాలే అతని గురించి మాట్లాడతాయని చెప్పాడు. క్రికెట్ ఆల్ టైమ్ గ్రేట్ ప్లేయర్లలో ధోనీ కూడా ఒకడని కితాబిచ్చాడు. దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్ ను ఒక ఛాంపియన్ కెప్టెన్ నాయకత్వంలో ఆడతామని చెప్పాడు. రానున్న నెలల్లో టీమిండియాను పటిష్ట స్థితికి చేర్చడమే తమ లక్ష్యమని రవిశాస్త్రి తెలిపాడు. ఇండియా-ఏ కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా భవిష్యత్తు కార్యాచరణలో సాయపడటానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పాడు.