: జగన్ ది దొంగ దీక్ష అనడం సిగ్గుచేటు : వైఎస్ఆర్సీపీ నేత మేరుగ నాగార్జున
మంత్రి రావెల కిషోర్ బాబుకు దీక్ష అంటే అర్థం తెలియదని, అందుకే జగన్మోహన్ రెడ్డిది దొంగదీక్ష అంటున్నారని, ఇది సిగ్గుచేటని వైఎస్ఆర్సీపీ నేత మేరుగ నాగార్జున మండిపడ్డారు. విలేకరులతో ఆయన మాట్లాడుతూ, తమ అధినేత నిరాహారదీక్ష గురించి మాట్లాడే నైతికహక్కు రావెలకు లేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబును మెప్పించడానికి రావెల నానా భాషలు మాట్లాడుతూ, వేషాలు వేస్తున్నారని ఆయన ఆరోపించారు. రావెల మాటలతో ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదన్నారు. దళితులకు రావాల్సిన నిధులను పక్కదారి పట్టిస్తున్న రావెల తన అధికారం అడ్డంపెట్టుకుని ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తున్నారంటూ నాగార్జున ధ్వజమెత్తారు.