: దర్శకుడు శరత్ కుమార్ పై సెన్సార్ బోర్డు సభ్యురాలు దాడి... ఆసుపత్రికి తరలింపు


సినీ దర్శకుడు శరత్ కుమార్ పై ప్రాంతీయ సెన్సార్ బోర్డు సభ్యురాలు మంగారెడ్డి దాడి చేశారు. అర్ధరాత్రి జరిగిన ఈ దాడిలో శరత్ కుమార్ తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో, అతడిని హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో మంగారెడ్డిపై శరత్ కుమార్ ఫిర్యాదు చేశారు. స్నేహితుడు కిషన్ తో కలసి మంగారెడ్డి తనపై ఇనుపరాడ్లతో దాడిచేశారని ఫిర్యాదులో శరత్ పేర్కొన్నారు. అయితే, అసభ్యకర ఎస్ఎంఎస్ లతో శరత్ కుమార్ తనను వేధిస్తున్నారని మీడియాతో మంగారెడ్డి తెలిపారు. ఈ క్రమంలో, కేవలం ఆత్మరక్షణ కోసమే శరత్ కుమార్ పై ఎదురు దాడి చేశానని చెప్పారు.

  • Loading...

More Telugu News