: ప్రార్థనలకు ఆటంకం కలిగించిన యువకులు ...శ్రీనగర్ లో ఉద్రిక్తత
శ్రీనగర్ లోని ఒక మసీదు వద్ద ప్రార్థనలు చేస్తుండగా అక్కడికి వచ్చిన కొందరు యువకులు ప్రార్థనలకు ఆటంకం కల్గించేందుకు యత్నించారు. ఆ యువకుల చేతిలో పాకిస్థాన్, ఐఎస్ఐఎస్ జెండాలు ఉండటం గమనార్హం. యువకులు మితిమీరి ప్రవర్తించడంతో హుటాహుటిన పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసులు తమ లాఠీలకు పనిచెప్పారు. దీంతో రెచ్చిపోయిన ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వడంతో పరిస్థితి అదుపుతప్పింది. పోలీసులు బాష్పవాయువు ప్రయోగం చేయడంతో ఆందోళనకారులు చెల్లాచెదురయ్యారు. శ్రీనగర్ లో బక్రీద్ పండుగ రోజూ కూడా ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకోవడంపై పలువురు ముస్లిం మతపెద్దలు ఆవేదన చెందుతున్నారు.