: వైకాపాకు హైకోర్టులో ఎదురుదెబ్బ... జగన్ ధర్నా పిటిషన్ విచారణకు నిరాకరణ


వైకాపా ఆశలపై హైకోర్టు నీళ్లు చల్లింది. ఆ పార్టీ వేసిన హౌస్ మోషన్ పిటిషన్ ను విచారించేందుకు హైకోర్టు నిరాకరించింది. గుంటూరులో జగన్ నిర్వహించదలచుకున్న ధర్నాకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే. దీంతో, వైకాపా శ్రేణులు హైకోర్టు మెట్లెక్కాయి. హౌస్ మోషన్ పిటిషన్ ను వేశాయి. గుంటూరులో దీక్షకు అనుమతి ఇచ్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషన్ లో వైకాపా కోరింది. అయితే, హౌస్ మోషన్ పిటిషన్ ను విచారించలేమని హైకోర్టు వెల్లడించింది. రెగ్యులర్ కోర్టుకు వెళ్లమని సూచించింది. దీంతో, రేపు జరగాల్సిన జగన్ దీక్ష వాయిదా పడినట్టయింది.

  • Loading...

More Telugu News