: చిరంజీవి... బీజేపీలోకి స్వాగతం: కిషన్ రెడ్డి


చిరంజీవి వంటి ప్రజల్లో గుర్తింపున్న ప్రముఖులకు తమ పార్టీ ఎల్లప్పుడూ స్వాగతం పలుకుతుందని బీజేపీ నేత కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ మధ్యాహ్నం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, చిరంజీవి పేరున్న నటుడని, అతనికున్న ఇమేజ్ పార్టీకి సహకరిస్తుందని అన్నారు. ఆయన బీజేపీలోకి వస్తానంటే, ఆనందంగా స్వాగతం పలుకుతామని వివరించారు. కాగా, కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై చిరంజీవి కోపంగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. పార్టీ కార్యకలాపాల్లో తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని, తనను పక్కన పెడుతున్నారని ఆయన భావిస్తున్నారని సమాచారం. ఇటీవల చిరంజీవి రాహుల్ గాంధీని కలవగా, 150వ సినిమాపై దృష్టి పెట్టకుండా, పార్టీ తిరిగి పుంజుకునే చర్యలు చేపట్టాలని రాహుల్ క్లాస్ పీకినట్టు తెలుస్తోంది. దీంతో ఇకపై ఆ పార్టీలో కొనసాగరాదని చిరంజీవి భావిస్తున్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఒకవేళ చిరంజీవి కాంగ్రెస్ పార్టీని వీడితే, బీజేపీలో చేరుతారో, లేక పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటారో!

  • Loading...

More Telugu News