: ముస్లింల సంక్షేమానికి టీడీపీ ప్రభుత్వం కృషి చేస్తోంది: చంద్రబాబు
విజయవాడ క్యాంపు కార్యాలయంలో ఈరోజు సీఎం చంద్రబాబును కొందరు ముస్లిం సోదరులు కలిశారు. ఈ సందర్భంగా వారికి సీఎం బ్రకీద్ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లింల సంక్షేమానికి టీడీపీ ప్రభుత్వం కృషి చేస్తోందని ఈ సందర్భంగా చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో త్వరలో హజ్ హౌస్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సీఎం ట్విట్టర్ ఖాతాలో కూడా ముస్లింలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.