: ముఖ్యమంత్రి అయినంత మాత్రాన మీరు చెప్పిందే చట్టమా?: అంబటి


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైకాపా నేత అంబటి రాంబాబు మండిపడ్డారు. ముఖ్యమంత్రి అయినంత మాత్రాన చంద్రబాబు చెప్పిందే చట్టమా? అని నిలదీశారు. అహంభావంతో, గర్వంతో చంద్రబాబు మాట్లాడుతున్నారని అన్నారు. జగన్ ధర్నాకు ప్రభుత్వం అనుమతి నిరాకరించిన నేపథ్యంలో, అంబటి మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు. ధర్నాకు అనుమతి ఇవ్వబోమని ప్రభుత్వం, వేరే స్థలంలో పెట్టుకుంటే అనుమతి ఇస్తామని పోలీసులు చెబుతున్నారని... ఈ ద్వంద్వ విధానాలు ఏమిటని ప్రశ్నించారు. దివంగత ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా వుండి కూడా అప్పట్లో దీక్షలు చేశారని... మీకు అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడెందుకు వచ్చిందని నిలదీశారు. ప్రతిపక్షాన్ని ఇష్టం వచ్చినట్టు అణచి వేయాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి పదవి శాశ్వతం కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు.

  • Loading...

More Telugu News