: జగన్ దీక్షపై హైకోర్టులో వైసీపీ పిటిషన్... నేడు విచారణ
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. తమ అధినేత జగన్మోహన్ రెడ్డి చేయతలపెట్టిన నిరాహార దీక్షకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఈ క్రమంలో పిటిషన్ పై జస్టిస్ శేషసాయి నివాసంలో నేడు విచారణ జరగనుంది. రేపు నిర్వహించాలనుకున్న దీక్షపై కోర్టు సాయంత్రంలోగా తీర్పు వెలువరించే అవకాశం ఉంది. మరోవైపు కోర్టు ఆదేశాల కోసం వైసీపీ నేతలు ఎదురుచూస్తున్నారు. కోర్టు ఆదేశాల ప్రకారమే దీక్ష చేస్తామని ఆ పార్టీ నేత అంబటి రాంబాబు అంటున్నారు. గుంటూరులోని ఉల్ఫ్ హాల్ గ్రౌండ్స్ లో దీక్ష చేయాలని వైసీపీ నిర్ణయించిన సంగతి తెలిసింది. ఇందుకు ఏపీ ప్రభుత్వం దీక్షకు అనుమతి నిరాకరించింది. కానీ వైసీపీ మాత్రం అక్కడే దీక్ష చేస్తామని అంటోంది. ప్రస్తుతం దీక్షా హాల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.