: నారాయణ కాలేజ్ విద్యార్థి ఆత్మహత్యాయత్నం
వరుసగా చోటు చేసుకుంటున్న విద్యార్థుల ఆత్మహత్యలతో నారాయణ విద్యాసంస్థల యాజమాన్యం ఇప్పటికే సతమతమవుతోంది. ఈ క్రమంలో, తాజాగా నారాయణ జూనియర్ కాలేజ్ లో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న శ్రీకాంత్ అనే విద్యార్థి ఆత్మహత్యకు యత్నించాడు. కర్నూలు జిల్లా నన్నూరు సమీపంలో ఉన్న జూనియర్ కాలేజ్ లో ఈ ఘటన సంభవించింది. శ్రీకాంత్ స్వస్థలం కర్నూలు జిల్లా ఉల్లిందుకొండ. అయితే, ఈ ఆత్మహత్యాయత్నం కాలేజీ వెలుపల జరిగిందని యాజమాన్యం చెబుతోంది. జరిగిన ఘటనపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆత్మహత్యకు యత్నించిన శ్రీకాంత్ ను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు.