: అక్టోబర్ 15 లోగా ప్రత్యేక హోదాపై స్పష్టత: సుజనా చౌదరి
అక్టోబర్ 15వ తేదీ లోపల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై స్పష్టత వస్తుందని కేంద్ర మంత్రి సుజనా చౌదరి అన్నారు. ప్రత్యేక హోదా సీమాంధ్రుల హక్కు అని చెప్పారు. చట్ట ప్రకారం అది మన హక్కు అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఏపీకి పూర్తి సహకారం అందుతోందని... ఇందులో భాగంగానే తాజాగా ఏపీకి రూ. 1100 కోట్లను కేంద్రం కేటాయించిందని తెలిపారు. రానున్న రోజుల్లో కేంద్రం నుంచి మరింత సహాయ, సహకారాలు అందనున్నాయని చెప్పారు. కేంద్ర బడ్జెట్ లో రూ. 100 కోట్లు మాత్రమే పోలవరం ప్రాజెక్టుకు కేటాయించారని మనం కంగారుపడ్డామని... కానీ ఇప్పుడు ఆ కేటాయింపులు రూ. 400 కోట్లకు పెరిగాయని చెప్పారు.