: సచిన్ దత్తత గ్రామం పుట్టంరాజువారి కండ్రిగకు 'ఆదర్శ' పురస్కారం


ప్రముఖ క్రికెటర్, రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండుల్కర్ దత్తత గ్రామం జాతీయస్థాయిలో పురస్కారం కైవసం చేసుకుంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఓజిలి మండలంలోని పుట్టంరాజువారి కండ్రిగకు ఆదర్శ గ్రామం పురస్కారం లభించింది. మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో 'సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన'పై నిర్వహించిన సమావేశంలో కేంద్ర మంత్రి చౌదరి వీరేంద్ర సింగ్ నుంచి నెల్లూరు జిల్లా సంయుక్త పాలనాధికారి ఇంతియాజ్ అహ్మద్ ఈ పురస్కారం అందుకున్నారు. సచిన్ దత్తత గ్రామంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను జేసీ అహ్మద్ ఈ సమావేశంలో వివరించారు.

  • Loading...

More Telugu News