: పార్లమెంటులో పిల్లి... బయట మాత్రం పులిలా బిల్డప్: జగన్ పై మోదుగుల ఫైర్
వైకాపా అధినేత జగన్ పై టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఎంపీగా ఉన్నన్ని రోజులు పార్లమెంటులో పిల్లిలా ఉన్న జగన్... బయట మాత్రం పులిలా బిల్డప్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. పార్లమెంటులో కడప పౌరుషం ఏమయిందని ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదాపై ధర్నాలు, నిరసనలు చేపట్టే నైతిక హక్కు జగన్ కు లేదంటూ మండిపడ్డారు. బీజేపీకి మిత్రపక్షం కావడం వల్లే ఏపీకి రూ. 3 వేల కోట్లను తీసుకు రాగలిగామని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి ఏం చేయాలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు బాగా తెలుసని, ఎవరూ సలహా ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు. జగన్ దీక్షను అడ్డుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం... ఇవే జగన్ ప్రాథమిక లక్ష్యాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.