: ఓ మహిళను ఎన్ కౌంటర్ చేస్తే... బతుకమ్మలు ఆడే కవిత ఎందుకు ప్రశ్నించలేదు?: శృతి తండ్రి
ఇటీవల వరంగల్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు చనిపోయిన సంగతి తెలిసిందే. మృతుల్లో ఎంటెక్ విద్యార్థిని శృతి కూడా ఉండటం సంచలనంగా మారింది. ఈ క్రమంలో ఆమె తండ్రి, విరసం సభ్యుడు కూడా అయిన సుదర్శన్ నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఓ కవిత కూడా చదివారు. ఆ కవితను విన్న అక్కడున్న వారంతా కంట తడి పెట్టారు. అయితే, తన కుమార్తె చనిపోయినందుకు తాను బాధ పడటం లేదని, తన ఆశయ సాధనలో భాగంగానే ఆమె ఆత్మబలిదానం చేసిందని చెప్పారు. బతుకమ్మ ఆటలాడే ఎంపీ కవితకు ఓ మహిళ ఎన్ కౌంటర్ లో బలి అయితే బాధ కలగలేదా? అని ఆయన ప్రశ్నించారు. ఈ ఎన్ కౌంటర్ పై ఆమె ఎందుకు స్పందించలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఎన్నో సమస్యలపై పోరాటం చేసేందుకే శృతి ఉద్యమబాట పట్టిందని అన్నారు.