: అత్యుత్తమ నేతే, కానీ లక్ష్యం సుదూరం: మోదీపై మీడియా మొఘల్


భారత ప్రధాని నరేంద్ర మోదీపై మీడియా మొఘల్ రూపర్ట్ మర్డోక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోదీతో సమావేశమైన ఆయన ఆపై తన ట్విట్టర్ ఖాతాలో "ప్రధాని మోదీతో గంటకు పైగా చర్చలు జరిపాం. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఇండియాకు దొరికిన అత్యుత్తమ ప్రధాని. అత్యుత్తమ విధానాలను ఆయన అమలు చేస్తున్నారు. అయితే, ఆయన లక్ష్యం అతి పెద్దది. సుదూరంగా ఉన్న దాన్ని అందుకోవడం ఎంతో కష్టం" అని వ్యాఖ్యానించారు. న్యూయార్క్ లోని వాల్డార్ఫ్ అస్టోరియా హోటల్ లో మోదీతో సమావేశమైన 47 మంది సీఈఓలలో మర్డోక్ కూడా ఉన్నారు. కాగా, వేగంగా అనుమతులు, పన్ను సంస్కరణలు, జీఎస్టీ తదితరాలపై మరింత స్పష్టత వస్తే, ఇండియాలోని ఇంధనం, మౌలిక వసతుల రంగాలకు పెట్టుబడులు వస్తాయని ఎర్నెస్ట్ అండ్ యంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వీన్ బర్గర్ అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News