: మక్కా తొక్కిసలాటలో 14 మంది భారతీయులు దుర్మరణం... ప్రకటించిన కేంద్రం


మక్కాలో నిన్న చోటుచేసుకున్న తొక్కిసలాటలో 717 మంది చనిపోయారు. మరో 800 మందికి పైగా గాయపడ్డారు. పవిత్ర యాత్రకు వెళ్లిన భక్తులు అకస్మాత్తుగా జరిగిన తొక్కిసలాటలో ఊపిరాడక మృత్యువాత పడ్డారు. చనిపోయిన వారిలో భారతీయులు కూడా ఉన్నారు. ఈ ప్రమాదంలో 14 మంది భారతీయులు చనిపోయారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం అధికారికంగా ప్రకటించింది. అయితే చనిపోయిన వారి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. 14 మంది భారతీయుల్లో హైదరాబాదుకు చెందిన మహిళ కూడా ఉన్నారు.

  • Loading...

More Telugu News