: 40 నిమిషాల్లో 3 పేజీల కంప్లెయింట్... కోర్టు హాల్లోనే పెన్ను పట్టిన హార్దిక్ పటేల్


గుజరాత్ యువ సంచలనం హార్దిక్ పటేల్ నిన్న అహ్మదాబాదులోని గుజరాత్ హైకోర్టులో పెన్నూ పేపరు పట్టాల్సి వచ్చింది. తన అదృశ్యానికి సంబంధించి కోర్టు ఎదుట హాజరైన హార్దిక్ పటేల్ జరిగిన పరిణామాలను న్యాయమూర్తికి వివరించే యత్నం చేశారు. అయితే న్యాయమూర్తి కల్పించుకుని జరిగిన పరిణామాలన్నిటినీ పేపరుపై రాసి సమర్పించాలని ఆదేశించారు. దీంతో అక్కడికక్కడే పెన్నూ పేపరు పట్టిన హార్దిక్ అక్కడే కూర్చున్నారు. రెండు రోజులుగా తనకు ఎదురైన అనుభవాలను ఆయన పేపరుపై పెట్టారు. 40 నిమిషాలు గడిచేలోగానే ఆయన మూడు పేజీల మేర ఫిర్యాదును రాసేశారు. తర్వాత దానిని న్యాయమూర్తికి అందజేశారు. సదరు ఫిర్యాదును సీల్డ్ కవర్ లో పెట్టించిన న్యాయమూర్తి తదుపరి విచారణను రెండు రోజులు వాయిదా వేశారు.

  • Loading...

More Telugu News